Home న్యూస్ వినయ విధేయ రామ రివ్యూ…ఏంటి బోయ ఇదీ!!

వినయ విధేయ రామ రివ్యూ…ఏంటి బోయ ఇదీ!!

2500
0

        మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత తనతో సినిమా చేయడానికి టాలీవుడ్ హేమా హేమీ దర్శకులు సిద్ధం అవ్వగా అందరినీ కాదని బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ని ఒకే చేశాడు రామ్ చరణ్, మాస్ లో బోయపాటి కి ఉండే రెస్పాన్స్ తో తన ఫ్యాన్స్ ఒక పక్కా మాస్ మసాలా మూవీ ఇవ్వాలనుకున్న రామ్ చరణ్ నేడు వినయ విధేయ రామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ లైన్ విషయానికి వస్తే… 5 గురు అన్నదమ్ములలో రామ్ చరణ్ చిన్నవాడు, ఆ అన్నదమ్ములలో ఒకరికి వచ్చిన ప్రాబ్లం ని తమ్ములు ఎలా సాల్వ్ చేశాడు అన్నది ఓవరాల్ గా స్టొరీ పాయింట్..

సింగిల్ లైన్ స్టొరీ తో రామ్ చరణ్ ని బోయపాటి ఎలా మెప్పించాడో తెలియదు కానీ కేవలం యాక్షన్ సీన్స్ నే నమ్ముకుని తీసిన సినిమా ఇది, బోయపాటి ఇదివరకు సినిమాల్లో కూడా కథ పాయింట్ ఎలా ఉన్నా యాక్షన్ సీన్స్ హైలెట్ అవుతాయి కానీ అక్కడ ఒక లాజిక్ ఉంటుంది.

ఆ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ అవ్వడానికి అంతకన్నా ముందు ఒక స్ట్రాంగ్ సీన్స్ ని బోయపాటి రాసుకునే వాడు, కానీ వినయ విధేయ రామ సినిమా లో అన్ని కూడా ఆర్టిఫీషియల్ గా మారాయి, సీన్ బై సీన్ ని ప్రేక్షకులు ఎంత ఈజీగా గెస్ చేసేలా ఉన్నాయో చెప్పడం కష్టం.

ఇలాంటి సినిమా లో రామ్ చరణ్ అన్నీ తానై యాక్షన్ సీన్స్ లో వొళ్ళు ఊనం చేసుకునేలా కష్టపడ్డాయి, ట్యూన్స్ ఏమాత్రం ఆకట్టుకొక పోయినా తన డాన్స్ తో పాటలు చూసేలా చేశాడు. సీన్స్ చూసే విధంగా లేకున్నా తన పెర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్ తో కొంత వరకు చూసేలా చేశాడు.

కానీ ఎంత చేసినా కథ లో దమ్ము లేకపోవడంతో ఇవేవి సరిపోలేదు. మిగిలిన నటీనటులు అందరు హీరోయిన్ తో సహా జస్ట్ ఒకే అనిపించుకున్నారు అంతే… ఇక సంగీతం విషయం బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.

దేవి నుండి ఇలాంటి ప్రాడక్ట్ ని ఎవ్వరూ ఊహించలేదు, ఒకే బ్యాగ్రౌండ్ స్కోర్ ని సినిమా మొత్తం వాడి వాడి బోర్ కొట్టేశాడు. ఇక ఎడిటింగ్ చాలా వీక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా మిగిలినవి తేలిపోయాయి. ఇక ఆఖరికి బోయపాటి దగ్గరికి వస్తే రొటీన్ ఫార్మాట్ తో ఇంకెన్ని సినిమాలు తీస్తాడో అనిపిస్తుంది.

ఒక ఇండస్టీ హిట్ కొట్టిన హీరో అందరినీ కాదని తనకి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని బోయపాటి నిలుపుకోలేక పోయాడు. యాక్షన్ సీన్స్ ఎక్కువ పెడితే సరిపోతుంది అనుకున్నాడో ఏమో సినిమా మొత్తం అవే పెట్టేశాడు బోయపాటి.

ఇక కొన్ని సీన్స్ కి థియేటర్స్ షేక్ అవ్వాల్సింది పోయి నవ్వే లా కూడా టేకింగ్ ఉంది, అవి ఇక్కడ రివీల్ చేయడం మంచిది కాదు. ఓవరాల్ గా ఇది పక్కా డైరెక్టర్ ఫైల్యూర్ మూవీ గా చెప్పుకోవాలి. హీరో కష్టానికి దర్శకుడు వీక్ డైరెక్షన్ తో సినిమా ఫేట్ మారిపోయింది.

ఫ్యాన్స్ కి మాస్ ఆడియన్స్ కి కొంతవరకు నచ్చేలా ఉన్న సినిమా కామన్ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అనేదాని పై సినిమా ఫేట్ ఆధార పడి ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్… అది కూడా కేవలం రామ్ చరణ్ కే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here