Home గాసిప్స్ బ్లాక్ బస్టర్ రీమేక్…దంచికొడతా అంటున్న వినాయక్!!

బ్లాక్ బస్టర్ రీమేక్…దంచికొడతా అంటున్న వినాయక్!!

0

టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒకప్పుడు రాజమౌళి తర్వాత రెండో ప్లేస్ లో నిలిచిన డైరెక్టర్ వివి వినాయక్. మాస్ కమర్షియల్ మూవీస్ కి కేరాఫ్ గా నిలిచిన వినాయక్ రీసెంట్ టైం లో మాత్రం ఫాం కోల్పోయాడు. అల్లుడు శీను సినిమా మెప్పించినా కమర్షియల్ ఫ్లాఫ్ అయింది, అఖిల్ సినిమా డిసాస్టర్ అయింది. ఖైదీనంబర్ 150 మెగాస్టార్ రీ ఎంట్రీ వల్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇంటెలిజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర….

అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా…. రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న వినాయక్ హీరో గా ఒక సినిమా ట్రై చేసినా అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇలాంటి టైం లో వినాయక్ కి అనుకోకుండా ఓ అద్బుతమైన అవకాశం దక్కింది.

అదే మెగాస్టార్ చిరంజీవి చేయాలి అనుకుంటున్న మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్. ముందు సుజిత్ డైరెక్షన్ లో ఈ రీమేక్ అనుకున్నా కానీ సుజిత్ చెప్పిన చేంజెస్ చిరు కి రామ్ చరణ్ కి నచ్చకపోవడం తో సుజిత్ ప్లేస్ లో ఈ రీమేక్ భాధ్యతలను వినాయక్ కి అప్పగించారు.

దాంతో కొన్ని రోజులు తెలుగు స్క్రిప్ట్ పై వర్క్ చేయడం మొదలు పెట్టిన వినాయక్ తనదైన రేంజ్ ట్రీట్ మెంట్ ని సినిమా స్క్రిప్ట్ కి అందించడం మొదలు పెట్టి కొన్ని మార్పులు చేశాక చిరు కి వినిపించారట. ఆ మార్పులు చిరుకి కూడా నచ్చడం తో మరిన్ని మార్పులు కూడా సూచించారట ఇతర సీన్స్ కి..

దాంతో స్క్రిప్ట్ మొత్తం తనదైన స్టైల్ లో మార్పులతో దుమ్ము లేపడానికి సిద్దం అయ్యాడు వినాయక్. ఇది వరకు చిరు తో రమణ తెలుగు రీమేక్ ఠాగూర్ తో, తర్వాత కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150 తో మెప్పించిన వినాయక్ ఈ సారి మరో రీమేక్ తో మెప్పించి హాట్రిక్ విజయాలను చిరు తో సొంతం చేసుకోవాలని చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here