యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ చక్ర.. రీసెంట్ టైం లో బాక్ టు బాక్ హిట్స్ కొట్టి తర్వాత వరుసగా ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకుంటూ వస్తూ వచ్చాడు విశాల్. డిటెక్టివ్, అభిమన్యుడు మరియు పందెం కోడి 2 లాంటి సినిమాలు తెలుగు లో మంచి రిజల్ట్ ని ఇవ్వగా తర్వాత టెంపర్ రీమేక్ అయోగ్య తో అలాగే యాక్షన్ మూవీ తో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్న విశాల్ ఇప్పుడు కొంత గ్యాప్ తో…
చక్ర సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సినిమా ట్రైలర్ ను లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ చేశారు, మంచి ఆఫర్ వస్తే సినిమాను డిజిటల్ రిలీజ్ చేయాలనీ చూశారు కానీ ఈలోపు విశాల్ పాత సినిమా యాక్షన్ నష్టాల గొడవ వలన ఈ సినిమా చిక్కుల్లో పడటంతో…
డిజిటల్ రిలీజ్ కుదరలేదు… తర్వాత డిజిటల్ రిలీజ్ కి రేట్లు కూడా చాలా తగ్గించి చెప్పడం మొదలు పెట్టారు. దాంతో ఇక థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన యూనిట్ ఈ నెల 19 న సినిమాను తమిళ్ లో తెలుగు లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమా కి…
తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. నైజాంలో 1.75 కోట్లు, సీడెడ్ లో 75 లక్షలు, ఆంధ్రా లో 2.4 కోట్ల బిజినెస్ సొంతం అయింది. దాంతో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 4.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 5.4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది…
సినిమా టోటల్ బడ్జెట్ 35 కోట్లు కాగా తమిళ్ బిజినెస్ లెక్కలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మొత్తం మీద సినిమా ఇది వరకు విశాల్ మూవీ యాక్షన్ బిజినెస్ తో పోల్చితే ఆ సినిమా 6.7 కోట్ల బిజినెస్ ను సాధించగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 1.8 కోట్ల తక్కువ రేటుకి ఈ సినిమాను అమ్మారు. మరి పోటి లో సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని నిలబడుతుందో చూడాలి..