కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు.. రీసెంట్ టైం లో రెండు మూడు ఫ్లాఫ్ మూవీస్ పడ్డా కానీ విశాల్ అంతకుముందు చేసిన డిటెక్టివ్, అభిమన్యుడు మరియు పందెం కోడి 2 సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ ను సొంతం చేసుకోగా విశాల్ లాస్ట్ మూవీ యాక్షన్ రిజల్ట్ తో మళ్ళీ అభిమన్యుడు టైప్ లో చేసిన…
చక్ర సినిమా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది అని అంతా అనుకోగా భేరం ఇప్పటికీ సరిగ్గా కుదరడం లేదు ఈ సినిమాకి, బడ్జెట్ 35 కోట్ల రేంజ్ లో ఉండగా నిర్మాతలు సినిమా 45 కోట్ల రేంజ్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి చేస్తుంది అని ఎక్స్ పెర్ట్ చేయగా…
మొదటి నుండి ఆఫర్లు 30 కోట్ల రేంజ్ లోనే ఉండటం తో ఆగగా రీసెంట్ గా యాక్షన్ నష్టాలూ క్లియర్ చేయాలి అంటూ కోర్టు కేసుల వలన బిజినెస్ మరింత తగ్గి ఆఫర్లు రావడం మొదలు అవ్వడం తో మరింత డిలే అవుతున్న ఈ సినిమా పై ఇప్పుడు మళ్ళీ కొంచం…
తగ్గి యూనిట్ కి మరింత షాక్ ఇవ్వనుంది అంటున్నారు. ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కి గాను కొన్ని OTT యాప్స్ రేటు ని మరింత తగ్గించి ఇప్పుడు 28 కోట్ల రేంజ్ డీల్ కి మేం అన్ని భాషల హక్కులను సొంతం చేసుకుంటాం అంటూ చెబుతున్నాయట. దాంతో యూనిట్ ఇప్పుడు ఎం చేయాలో తెలియని స్థితి లో ఉందని చెప్పాలి.
థియేటర్స్ లో రిలీజ్ అనుకున్న అన్ని భాషల్లో కలిపి ఇప్పుడు సినిమా ఎంత బాగున్నా 30 కోట్ల రేంజ్ రెవెన్యూ ని రాబట్టే అవకాశం లేదు కనుక కొంచం బెటర్ రేటు వస్తే సినిమాను డైరెక్ట్ రిలీజే చేయాలనీ అనుకుంటున్నారట, మరి ఇది జరుగుతుందో లేదో మరి కొన్ని వారాలు ఆగితే తెలిసి పోతుంది అని చెప్పాలి.