తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ కూడా ఒకరు… రీసెంట్ టైం లో కొన్ని మంచి విజయాలు దక్కినప్పటికీ లాస్ట్ రెండు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. భారీ ఆశలతో చేసిన టెంపర్ రీమేక్ అయోగ్య… భారీ బడ్జెట్ తో చేసిన యాక్షన్ మూవీ రెండూ కూడా భారీగా దెబ్బ తీసినా మళ్ళీ రెట్టించిన జోరు తో…
సినిమాలు కమిట్ అవుతున్న విశాల్ నుండి లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రావడానికి చక్ర సినిమా సిద్ధంగా ఉందని సమాచారం. రీసెంట్ గా భారీ హంగులతో సినిమా ట్రైలర్ ని అన్ని భాషల స్టార్స్ తో తెలుగు, తమిళ్, కన్నడ మలయాళంలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా గురించిన ఒక అప్ డేట్ ఇప్పుడు కోలివుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయదనే ఇలా భారీ హంగులతో నాలుగు భాషల్లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారని అంటున్నారు. దాంతో పాటే నిర్మాతలు మరియు హీరో కూడా….
సినిమా మొదటి టార్గెట్ థియేటర్ ఆడియన్స్ అయినా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్యా అది కుదరక పొతే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. కానీ నాలుగు భాషల్లో కలిపి డిజిటల్ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల రేంజ్ లో ఇస్తే సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉందని అంటున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
సినిమా కు అయిన బడ్జెట్ 30 కోట్ల రేంజ్ లో ఉంటుందట, తమిళ్ తెలుగు కలిపి 30 కోట్ల మేర, మలయాళం మరియు కన్నడ కలిపి 10 కోట్ల మేర రేటు ఆఫర్ వస్తే సినిమా అమ్మడానికి సిద్ధం అన్నట్లు అంటున్నారట. మరి అంత రేటు చెల్లించి సినిమాను కొనడానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి మరి…