తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో విశాల్ కూడా ఒకరు, రీసెంట్ టైం లో మళ్ళీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న విశాల్ మరోసారి అభిమన్యుడు తరహా కథ తో చేసిన సినిమా చక్ర. డిజిటల్ క్రైమ్స్ పై తెరకెక్కిన ఈ సినిమా అనేక అవరోధాలను ఎదురుకుని ఎట్టకేలకు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…మిలటరీ ఆఫీసర్ అయిన హీరో ఇంట్లో అలాగే పలుచోట్ల 50 దొంగతనాలు జరుగుతాయి, కానీ హీరో ఇంట్లో అశోక చక్ర మెడల్ కూడా దొంగలించబడుతుంది, దాంతో హీరో మిలటరీ నుండి వచ్చి ఈ కేసు మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అన్నది అసలు కథ…
ఏ దొంగతనాల వెనక ఎవరు ఉన్నారు, అన్ని దొంగతనాలు ఒకే టైం లో ఎలా జరిగాయి… వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు, అసలు మెయిన్ విలన్ ఎవరూ లాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా విశాల్ మరోసారి అభిమన్యుడు తరహా తన రోల్ లో…
చాలా ఈజ్ తో నటించి మెప్పించాడు… యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కూడా తన రోల్ వరకు బాగా నటించి మెప్పించింది. ఇక సినిమాలో కీలక రోల్ గురించి చెబితే థ్రిల్ మిస్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు… నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ రోల్ అదిరిపోయింది అని చెప్పాలి. హీరో కి ఆ రోల్ కి మధ్య నువ్వా నేనా అన్నట్లు రాసుకున్న సీన్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి.
ఇక మిగిలిన రోల్స్ కూడా పర్వాలేదు అనిపించగా సాంగ్స్ ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లో అవుతూ కొన్ని చోట్ల సూపర్ ఫాస్ట్ గా పడుతూ లేస్తూ సాగుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది.
తెలుగు డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి సింపుల్ కథని కొన్ని ఊహించని ట్విస్ట్ లు జోడించి బాగానే చెప్పాడు డైరెక్టర్.. కానీ అక్కడక్కడా ట్రాక్ తప్పిన సినిమా స్లో డౌన్ కూడా అవుతుంది, కానీ లెంత్ తక్కువ ఉండటం తో సినిమా మరీ బోర్ కొట్టిన ఫీలింగ్ ఏది కలగదు…
సింపుల్ గా చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ అభిమన్యుడు రేంజ్ లో ఉన్న సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓవరాల్ గా ఆ సినిమా కి కొంచం దూరంలో ఆగిపోయింది.. అలా అని సినిమా నిరుత్సాహ పరిచే సినిమా కూడా కాదు… అభిమన్యుడుని రీచ్ అవ్వలేదు అంతే… ఇలాంటి డిఫెరెంట్ మూవీ ని అటెంప్ట్ చేసిన విశాల్…
ఆల్ మోస్ట్ ఆడియన్స్ అంచనాలను అందుకున్నాడు, కొన్ని చోట్ల సినిమా స్లో అయినా ఓవరాల్ గా బాగుంది అనిపించేలా ముగుస్తుంది…అభిమన్యుడు టైప్ సినిమాలను ఇష్టపడ్డ ఆడియన్స్ ఈ సినిమాను కూడా ఇష్టపడే అవకాశం ఉంది… ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…