వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ఈ నగరానికి ఏమైంది సినిమాలో నలుగురిలో ఒకరిగా నటించి మెప్పించిన విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ ని ఫలక్నుమా దాస్ తో పెంచుకోగా ఈ ఇయర్ వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ మూవీ తో మరో మెట్టు ఎక్కేశాడు. నటుడిగా మరింత పేరు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ ని ఆచితూచి ఎంచుకుంటున్నాడు.
ఫలక్నుమా దాస్ రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. రీమేక్ తో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు రెండు ఇండస్ట్రీ లలో హిట్ అయిన రెండు సినిమాలను ఒకటి తర్వాత ఒకటి రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.. ముందుగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన….
ఓమై కడవులే సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి 2 కోట్ల మేర డిమాండ్ చేస్తూ సైన్ చేశాడట విశ్వక్ సేన్… ఇక ఈ మధ్య మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిన్న సినిమా కప్పేల తెలుగు రీమేక్ లో నటించడానికి కూడా విశ్వక్ సేన్ ఒప్పుకున్నాడని లేటెస్ట్ టాక్.
ఓ మై కడవులే కంప్లీట్ ఎంటర్ టైనర్ కాగా… కప్పేల సినిమా సింపుల్ గా సాగే సినిమా.. క్లైమాక్స్ లో మాత్రం ఓ ట్విస్ట్ కొంచం షాక్ ఇచ్చేలా ఉంటుంది. అయినా కానీ ఈ రీమేక్ లో నటించే స్కోప్ బాగా ఉందటంతో తన నటించడానికి ఓకే చెప్పారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.
రెండు సినిమాల్లో ఓ మై కడవులే శూర్ షాట్ హిట్ మూవీ మూవీ గా చెప్పుకోవచ్చు, ఇక కప్పేల సినిమా ను తెలుగు లో ఎలా టేక్ చేసి మార్పులు చేర్పులతో మరింత మెప్పించేలా తీస్తే ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశం పుష్పలంగా ఉందని చెప్పాలి. మరి విశ్వక్ సేన్ ఈ రెండు సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ కొట్టి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..