Home గాసిప్స్ ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదు…తేజ తో సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్!!

ఫ్లాఫ్స్ పడ్డా క్రేజ్ తగ్గలేదు…తేజ తో సినిమా బడ్జెట్ తెలిస్తే షాక్!!

1391
1

మాస్ లో ఒకప్పుడు మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు… కానీ అన్నీ ఒకే తరహా కథలను ఎంచుకోవడంతో వరుస పరాజయాలు ఎదురు అవ్వగా లౌక్యం సాహసం లాంటి సినిమాలు మెప్పించగా తర్వాత మళ్ళీ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నాడు గోపీచంద్. అయినా కానీ తనతో సినిమాలు భారీ లెవల్ లోనే దర్శకులు నిర్మాతలు చేస్తూ వస్తుండటం విశేషం అనే చెప్పాలి. గోపీచంద్ 25 వ సినిమా పంతం…

26 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందించగా లాస్ట్ ఇయర్ వచ్చిన చాణక్య 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఇప్పుడు చేస్తున్న సీటిమార్ కూడా భారీ బడ్జెట్ మూవీ నే కాగా లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా భారీ ఫ్లాఫ్స్ అయినా కానీ తన కొత్త సినిమాలకు…

మళ్ళీ మంచి బడ్జెట్ దక్కుతుంది. ఇక సీటిమార్ తర్వాత గోపీచంద్ చేస్తున్న కొత్త సినిమాలు 2, ఒకటి తేజ దర్శకత్వంలో కాగా మరొకటి మారుతి డైరెక్షన్ లో అంటున్నారు. ముందు తేజ డైరెక్షన్ లో సినిమా వుమన్ సెంట్రిక్ మూవీ అని అంటున్నారు. లేటెస్ట్ గా సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఆల్ మోస్ట్ కన్ఫాం అని అంటున్నారు.

కాగా ఈ సినిమా కి “అలివేలుమంగ వెంకటరమణ” అంటే క్లాస్ టైటిల్ ని అనుకుంటూ ఉండగా ఈ సినిమా కి కూడా మినిమం 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ సినిమాలు ఫ్లాఫ్స్ గా నిలిచినా డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకున్నాయి.

కానీ టాక్ బాలేక వీకెండ్ వీక్ కే పరుగు ముగించి 10 కోట్ల రేంజ్ లో షేర్ వసూల్ చేస్తున్నాయి. ఇంతలా ఫ్లాఫ్స్ ఎదురుకున్నా కానీ మళ్ళీ 20-25 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం గోపీచంద్ పై నమ్మకం బాగా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here