Home న్యూస్ బల్ల గుద్ది చెప్తున్నా…మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి దానికి మించి ఉంటుంది విశ్వంభర!!

బల్ల గుద్ది చెప్తున్నా…మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి దానికి మించి ఉంటుంది విశ్వంభర!!

0

లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులోకి అందరి కన్నా ముందు తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు…బింబిసార సినిమాతో మొదటి మూవీకే సంచలనం సృష్టించిన….

వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న మెగాస్టార్ కొత్త సినిమా విశ్వంభర(Vishwambhara) మూవీ జనవరి 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా పోస్టర్ క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండగా…

మెగాస్టార్ లుక్ కానీ గ్రాండియర్ కానీ పోస్టర్ వరకు ఎక్స్ లెంట్ గా మెప్పించింది అని చెప్పాలి ఇప్పుడు….ఓవరాల్ గా మెగాస్టార్ బర్త్ డే కి టీసర్ వస్తుంది అని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా పోస్టర్ తోనే మంచి అంచనాలు సినిమా మీద నమోదు అయ్యేలా చేయగా…

 

ఇక సినిమా డైరెక్టర్ వశిష్ట మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేలా కామెంట్స్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి ఇచ్చాడు అని చెప్పాలి. వాల్తేరు వీరయ్యతో ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టి తర్వాత వెంటనే భోలా శంకర్ తో ఎపిక్ ఫ్లాఫ్ ను అందుకున్న చిరు…

విశ్వంభరతో సాలిడ్ కంబ్యాక్ ను ఇప్పుడు తిరిగి సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న వశిష్ట మీడియాతో మాట్లాడుతూ “మీరు ఎన్ని ఎక్స్ పెర్టేషన్స్ అయినా పెట్టుకోండి దానికి వంద రెట్లు ఉంటుంది సినిమా, గుద్ది చెప్తున్నా సంక్రాంతి మనదే”…

అంటూ డైరెక్టర్ వశిష్ట సినిమా మీద తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు…సినిమా అఫీషియల్ టీసర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతూ ఉండగా టీసర్ రిలీజ్ నుండి సినిమా ప్రమోషన్స్ మొదలు అయ్యి నాన్ స్టాప్ గా సినిమా రిలీజ్ వరకు సాగుతాయని. సంక్రాంతికి మెగా మాస్ హిట్ ఖాయమని నమ్మకంగా చెప్పారు…

God Father 2 Week (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here