Home న్యూస్ దంచికొట్టిన వీర సింహా రెడ్డి జై బాలయ్య సాంగ్!!

దంచికొట్టిన వీర సింహా రెడ్డి జై బాలయ్య సాంగ్!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా వీర సింహా రెడ్డి, బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా లోని మొదటి సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా జై బాలయ్య లిరిక్ తో వచ్చిన ఈ మాస్ ఆంతెం కి తమన్ అందించిన మ్యూజిక్ కూడా బాగానే హైలెట్ అయింది అని చెప్పాలి ఇప్పుడు… 

ఓవరాల్ గా సాంగ్ మరీ అద్బుతం కాదు కానీ ఫస్ట్ విన్నప్పుడు మాత్రం పర్వాలేదు బాగుంది అనిపించగా రిపీట్స్ లో బాగానే ఇంప్రెస్ చేసింది అని చెప్పాలి. కాగా సాంగ్ విన్నప్పుడు ఇది వరకు వచ్చిన ఒకటి రెండు ఓల్డ్ సాంగ్స్ ని మిక్స్ చేసి…

ఈ సాంగ్ ని రూపొందించారు అనిపించింది. కొంచం భరత్ అనే నేను లోని దండాలయ్య సాంగ్ అలాగే ఓల్డ్ ఒసే రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ గుర్తుకు రావడం ఖాయం, అయినా కానీ క్యాచీ ట్యూన్ తో వచ్చిన జై బాలయ్య సాంగ్ చాలా వరకు ఇంప్రెస్ చేయగా…

ఫ్యాన్స్ కి అయితే ఇంకా బాగా నచ్చింది అని చెప్పాలి. మొత్తం మీద సాంగ్ కి రెస్పాన్స్ బాగానే ఉండటంతో ఇక ఇప్పుడు 24 గంటల్లో ఈ సాంగ్ కి యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ అండ్ లైక్స్ సొంతం అవుతాయి అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here