మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన వండర్ వుమన్ మూవీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది.. తర్వాత సినిమా కి సీక్వెల్ ని అనౌన్స్ చేయగా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…ఈజిప్ట్ గాడ్స్ కాలం నాటి ఒక స్టోన్ కి ఒక పవర్ ఉంటుంది… ఆ పవర్ ని ఉపయోగించి ఒక కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుంది కానీ కోరిన వాళ్ళ మరో శక్తి కోల్పోతారు…ఈ పవర్ ని ఉపయోగించిన విలన్స్ వండర్ వుమన్ ఎలా అడ్డుకుంది అన్నది కథ…
అసలు పాయింట్ ఇదే అయినా సినిమాలో చాలానే ఉపకథలు ఉన్నాయి, అవి రివీల్ చేస్తే థ్రిల్ పోతుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా గల్ గాడట్ వండర్ వుమన్ గా మరోసారి ఓ రేంజ్ లో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ కూడా అద్బుతంగా చేసింది… మాస్ ని ఆకట్టుకునే ఫైట్స్ కూడా మెప్పించింది..
ఇక ఇతర రోల్స్ కూడా అన్నీ మెప్పించాగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి… ఫైట్ సీన్స్ ఉన్నవి తక్కువే అయినా వాటికి బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉంటుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది… సినిమా మొదలు అవ్వడం ఆసక్తిగా మొదలు అయినా కానీ…
కథ సాగుతున్న కొద్ది స్లో నరేషన్ బోర్ కొట్టిస్తుంది… అక్కడక్కడ కొన్ని సీన్స్ మళ్ళీ మెప్పించినా కానీ ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ మేజర్ మైనస్ పాయింట్స్… అలాగే కథ పాయింట్ కూడా చాలా సింపుల్ గా ఉండటం తో పాటు మొదటి పార్ట్ తో పోల్చితే వీక్ గా కూడా అనిపిస్తుంది…
ఆడియన్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చే భారీ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ మాత్రం ఎందుకనో ఇతర DC మూవీస్ తో పోల్చితే తక్కువ క్వాలిటీనే అనిపిస్తుంది… ఫైట్ సీన్స్ కొన్ని బాగా డిసైన్ చేసినప్పటికీ క్లైమాక్స్ ఫైట్ సీన్ ని ఇంకా ఎక్కువ ఊహించుకుంటే కొంచం సింపుల్ గా ముగించారు అనిపిస్తుంది…
ఓవరాల్ గా చూసుకుంటే మరీ మొదటి పార్ట్ రేంజ్ లో లేకున్నా కానీ ఉన్నంతలో సినిమా బాగానే మెప్పిస్తుంది, లెంత్ కొంచం తగ్గించి, స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ విషయం లో మరింత శ్రద్ధ తీసుకుని ఆడియన్స్ కోరుకునే గూస్ బంప్స్ సీన్స్ ని పెట్టి ఉంటె సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది…
కానీ కథ పాయింట్ డీటైల్స్ చాలా డెప్త్ గా ఉండటం తో ఇవన్నీ పెట్టె అవకాశం లేకపోయింది, ఇవన్నీ అర్ధం చేసుకునే ఓపికతో సినిమా చూడగల వాళ్లకి సినిమా నచ్చుతుంది, హాలివుడ్ మూవీ… వండర్ వుమన్ కి సీక్వెల్ కాబట్టి మాస్ గా ఉంటుంది ఓ రేంజ్ లో మెప్పిస్తుంది అని అంచనాలను భారీగా పెంచుకుంటే….
మాత్రం సినిమా నిరాశపరచడం ఖాయం… చాలా కాలానికి థియేటర్స్ అన్నీ ఓపెన్ అయిన సందర్భంగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది కాబట్టి మెప్పించే ప్రయత్నం చాలా వరకు చేసింది ఈ సినిమా… కొంచం ఓపికతో చూస్తె సినిమా నచ్చడం ఖాయం… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…
Nice narration .. tqs