Home న్యూస్ “వరల్డ్ ఫేమస్ లవర్” రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

“వరల్డ్ ఫేమస్ లవర్” రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

      యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కాథరిన్ తెస్రా మరియు ఇజబెల్ నటించిన లేటెస్ట్ మూవీ “వరల్డ్ ఫేమస్ లవర్” వరల్డ్ వైడ్ గా నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది, సుమారు 1150 వరకు థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు అసలు సిసలు రివ్యూ లోకి వెళ్లి పోదాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే… రైటర్ అవ్వాలి అనుకునే హీరో కొన్ని కారణాల వల్ల తను ప్రేమించిన రాశిఖన్నా నుండి విదిపోతాడు, తర్వాత ఒక బుక్ రాయడం మొదలు పెడతాడు, తర్వాత ఏం చేశాడు, తిరిగి రాశిఖన్నా తో కలిసాడా లేదా, మిగిలిన హీరోయిన్స్ రోల్స్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా నటుడిగా సినిమా సినిమా కి మరింత రాటుదేలుతున్న విజయ్ దేవరకొండ మరోసారి తన నటనతో ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాడు, పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉండగా అన్ని పాత్రల్లో తన నటనతో ఓ రేంజ్ లో మెప్పిస్తాడు విజయ్ దేవరకొండ.

ఇక హీరోయిన్స్ లో రాశిఖన్నా మెప్పించినా ఎక్కువ మార్కులు మాత్రం ఐశ్వర్య రాజేష్ రోల్ కి దక్కాయి, ఆ పాత్ర తీర్చిదిద్దిన తీరు మెప్పిస్తుంది, మిగిలిన హీరోయిన్స్ కాథరిన్ మరియు ఇజబెల్ పర్వాలేదు అనిపిస్తారు. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో…

సాంగ్స్ నిరాశనే మిగిలించాయి, వెండితెరపై చూడటానికి బాగానే ఉన్నా, ఏవి కూడా రిజిస్టర్ అవ్వవు, కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంటుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగానే మెప్పిస్తుంది. కానీ సెకెండ్ ఆఫ్ లో అంచనాలను అందుకోలేదు.

ఇక్క తప్పు ఎడిటర్స్ కూడా కాదు, తీర్చిదిద్దిన డైరెక్టర్ ది. ఇక సినిమాటోగ్రఫీ అదిరి పోయే విధంగా భారీ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది, ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక క్రాంతిమాధవ్ డైరెక్షన్ విషయానికి వస్తే… ఇప్పటి వరకు తాను చేసిన క్లీన్ క్లాస్ మూవీస్ కాకుండా..

పూర్తిగా రా కంటెంట్ తో అర్బన్ టచ్ మరీ ఎక్కువగా ఉన్న లవ్ స్టొరీ తో ఫస్టాఫ్ వరకు మెప్పించాడు, సెకెండ్ ఆఫ్ కూడా బాగానే మొదలు అయినా ఒక స్టేజ్ తర్వాత పూర్తిగా పట్టాలు తప్పి సహనానికి పరిక్ష పెడుతుంది. అదే సినిమా కి మేజర్ మైనస్ పాయింట్ అయ్యి నిరాశతో బయటికి వచ్చేలా చేస్తుంది.

ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్, ఐశ్వర్య రోల్, ఫస్టాఫ్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకెండ్ ఆఫ్, వీక్ స్టొరీ అండ్ వీక్ డైరెక్షన్ మేజర్ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి.

మొత్తం మీద పూర్తీ హై క్లాస్ అర్బన్ ఆడియన్స్ ఉన్నంతలో కొద్ది వరకు ఎంజాయ్ చేయోచ్చు, కానీ రెగ్యులర్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ని సినిమా మెప్పించే అవకాశాలు చాలా తక్కువ.. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ [2.5/5]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here