Home న్యూస్ అన్ సీజన్…అక్షరాలా 31+…మెంటల్ మాస్ ఇది!!

అన్ సీజన్…అక్షరాలా 31+…మెంటల్ మాస్ ఇది!!

0

     విజయ్ దేవరకొండ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది, డియర్ కామ్రేడ్ లాంటి డిసాస్టర్ తర్వాత కూడా అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరి నెలలో భారీ ఎత్తున వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సాలిడ్ బిజినెస్ తో పాటు రిలీజ్ ని కూడా సొంతం చేసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

ముందుగా సినిమా టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని పరిశీలిస్తే, నైజాం లో 260 కి పైగా థియేటర్స్ లో, సీడెడ్ లో 140 కి పైగా థియేటర్స్ లో ఆంధ్రా లో 320 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…

720 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 220 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా ఓవర్సీస్ లో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, టోటల్ వరల్డ్ వైడ్ గా 1150 కి అటూ ఇటూ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ని గమనిస్తే
Nizam – 9Cr
Ceeded – 4Cr
Andhra – 10Cr
AP TG: 23Cr
Ka & ROI: 4(including Dub releases)
OS: 3.5Cr
Total WW Business: 30.5Cr
డియర్ కామ్రేడ్ డిసాస్టర్ రిజల్ట్ తర్వాత ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో కూడా ఇలాంటి బిజినెస్ అంటే అది మెంటల్ మాస్ అనే చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 31.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది, బిజినెస్ లో ఇతర భాషల బిజినెస్ కూడా కలిసే ఉంది. మొత్తం మీద బిజినెస్ పరంగా దుమ్ము లేపిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రికవరీ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here