Home న్యూస్ యాత్ర2 రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

యాత్ర2 రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లైఫ్ స్టొరీ పాయింట్ తో అప్పట్లో వచ్చిన యాత్ర సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పించింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తండ్రి చనిపోయిన తర్వాత ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి, అక్కడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గా జర్నీ ఏంటి అన్న కాన్సెప్ట్ తో వచ్చిన యాత్ర2(Yatra2 Movie Review) ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెసుకుందాం పదండీ…

స్టొరీ పాయింట్ ముందు చెప్పినట్లు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, తండ్రి ప్లేస్ ముఖ్యమంత్రి కావాల్సిన జగన్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు..ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన యాత్ర2 లో చాలా వరకు సన్నివేశాలు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లే సాగుతాయి…

కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా బాగా రాసుకోగా జగన్ గా జీవా(Actor Jiva) ఆ రోల్ కి చాలా వరకు న్యాయం చేశాడు, అలాగే మమ్ముట్టి(Mammootty) ఉన్నంత వరకు బాగా ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో బాగానే నటించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బయోపిక్ కాబట్టి కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా…

YSR అలాగే జగన్ అభిమానాలకు ఈ యాత్ర2 అనే జర్నీ బాగానే నచ్చే అవకాశం ఉండగా, కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే ఇతర రాజకీయ పార్టీలకు ఇది కొంచం ఓవర్ ది టాప్ వెళ్ళినట్లు అనిపించవచ్చు, ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే… సినిమాలో కొన్ని చోట్ల సన్నివేశాలు కొంచం ఓవర్ ది టాప్ వెళ్ళినట్లు అనిపించినా కూడా…

అప్పట్లో జరిగిన విషయాలు అన్నీ తెలియని వాళ్ళకి తెలిసినా మళ్ళీ గుర్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది….ఇద్దరు యాక్టర్స్ ఎక్స్ లెంట్ గా నటించడం, కొన్ని సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటం, సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా మెప్పించడం లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్… కొంచం రన్ టైం తగ్గించి ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి ఉంటే ఇంకా బాగుండేది….

ఇక సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుండటంతో విజువల్స్ పరంగా సినిమా బాగా ఆకట్టుకుంది…. టేకింగ్ పరంగా డైరెక్టర్ చాలా రిచ్ గా సినిమాను రూపొంచాడు, యాక్టర్స్ నుండి మంచి పెర్ఫార్మెన్స్ ను రాబట్టుకున్నాడు అని చెప్పొచ్చు…ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ముందే చెప్పినట్లు జగన్ అభిమానాలకు సినిమా బాగా నచ్చుతుంది. 

ఇతర పార్టీల వాళ్ళకి యావరేజ్ గా అనిపించవచ్చు, ఇక కామన్ ఆడియన్స్ కి పర్వాలేదు ఒకసారి ఈజీగా చూసేలా సినిమా ఉంది అనిపించడం ఖాయం….ఇది బయోపిక్ కాబట్టి సినిమాకి రేటింగ్ ఏమి ఇవ్వడం లేదు కానీ….ఇలాంటి బయోపిక్స్ ఇష్టపడే వాళ్ళకి కామన్ ఆడియన్స్ కి సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here