Home న్యూస్ జీరో షేర్…చరిత్రకెక్కిన రామ్ చరణ్!

జీరో షేర్…చరిత్రకెక్కిన రామ్ చరణ్!

0

       బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఓ పెద్ద స్టార్ హీరో సినిమా విషయం లో ఇలాంటివి జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక చేతులు ఎత్తేసిన రోజులు ఉన్నాయి కానీ స్టార్ హీరోల సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ లో మొదటి నుండి ఓపెనింగ్స్ అండ్ వీకెండ్ వరకు కలెక్షన్స్ సినిమా జానర్ కి అతీతంగా రావడం మనం చూస్తూనే ఉన్నాం… కానీ..

మొదటి సారి చరిత్రలో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరో నటించిన సినిమా కి ఈ రేంజ్ లో విముఖత రావడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఆ హిరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ మూవీ వినయ విదేయ రామ అని చెప్పాలి.

ఈ సినిమాను ఓవర్సీస్ లో టోటల్ గా 8 కోట్లకు అమెరికాలో భారీ గా అమ్మారు. రంగస్థలం తో అక్కడ నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టాడు అన్న నమ్మకం తో బోయపాటి కెరీర్ లో ఒక్క 1 మిలియన్ లేదు అన్న విషయాన్నీ కూడా మరిచిపోయి రామ్ చరణ్ మీద నమ్మికంతో…

8 కోట్లకి సినిమాని కొని మరో 50 నుండి 60 లక్షల దాకా పబ్లిసిటీ మరియు ప్రింట్స్ ఖర్చులు చేయగా వినయ విదేయ రామ రిలీజ్ అవ్వడమే అక్కడ మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అవ్వగా వీకెండ్ మొత్తం మీద అక్కడ $250K కూడా అందుకోలేని పరిస్థితి వచ్చింది.

ఆ మొత్తం గ్రాస్ రూపంలో 1.6 కోట్ల లోపు ఉండగా షేర్ ఒక 60 లక్షల రేంజ్ లో ఉంటుందని సమాచారం… అంటే సినిమా కలెక్షన్స్ ఇప్పటివరకు కేవలం పబ్లిసిటీ మరియు ప్రింట్స్ ఖర్చులు మాత్రమె సాధించగా అసలు షేర్ మొత్తం “జీరో” వచ్చింది. ఇక తేరుకోవడం కూడా కష్టమే అంటున్నారు.

దాంతో ఓవర్సీస్ చరిత్ర లో మరే స్టార్ సినిమా సాధించని రికార్డ్ ని ఈ సినిమా అందుకుంది… దీనికి ప్రధాన కారణం దర్శకుడు అనే చెప్పాలి, బోయపాటి కి మేజర్ క్రెడిట్ వెళ్ళగా ఒప్పుకున్నందుకు ఇప్పుడు చరక్ కి కూడా కష్టాలు తప్పడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here