Home న్యూస్ F2 డే-2 కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది!

F2 డే-2 కలెక్షన్స్…దుమ్ములేచిపోయింది!

1

  విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ గా 7.6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపగా అందులో రెండు తెలుగు రాష్ట్రల కలెక్షన్స్ సూపర్ సాలిడ్ గా వచ్చిన విషయం తెలిసిందే, ఇక రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో దుమ్ము లేపి మంచి వసూళ్ళని సాధించింది.

సంక్రాంతి రేసు లో చివరగా వచ్చినప్పటికీ పక్కా పండగ మూవీ అవ్వడం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు మొత్తం కల కల లాడుతున్నాయి. దాంతో రెండో రోజు సినిమా ఇప్పటికే నైజాం లో 1.5 కోట్లు, సీడెడ్ లో 75 లక్షల రేంజ్ లో వసూళ్లు అందుకుందట.

మిగిలిన చోట్ల కలెక్షన్స్ ఇంకా తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here