Home న్యూస్ కోలివుడ్ కి 1000 కోట్ల సినిమా ఇది…రికార్డుల జాతర ఖాయం!!

కోలివుడ్ కి 1000 కోట్ల సినిమా ఇది…రికార్డుల జాతర ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోసిన సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ….తమిళ్ తో పాటు తెలుగు హిందీ అన్ని చోట్లా ఓ రేంజ్ లో కలెక్షన్స్ తుఫాన్ సృష్టించిన ఈ సినిమా ఎపిక్ విజయాన్ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించి…

టోటల్ రన్ లో 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు వర్షన్ కూడా ఆల్ మోస్ట్ 100 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించి తెలుగులో డబ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….

అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతుందని ఎప్పటి నుండో వార్తలు వస్తూ ఉండగా ఇప్పుడు అఫీషియల్ గా టీం జైలర్ మూవీ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు….ఈ అనౌన్స్ ఎదో చిన్న పోస్టర్ తో కూడా చేయోచ్చు కానీ అలా కాకుండా ఇప్పటి నుండే హైప్ మరో లెవల్ లో ఉండేలా…ఒక అనౌన్స్ మెంట్ వీడియోతో వచ్చారు…

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అలాగే డైరెక్టర్ నెల్సన్ గోవాలో స్టోరీ సిట్టింగ్ లో ఉండి ఎలాంటి కథని సినిమాగా చేయాలి అని ఎదురు చూస్తున్న టైంలో విలన్స్ బ్యాచ్ ఒక్కొక్కరు చనిపోతూ ఉండగా హీరో ఎంట్రీ జరుగుతుంది….తర్వాత భారీ లెవల్ లో విద్వంసం జరిగిన తర్వాత జైలర్2 అనౌన్స్ మెంట్ జరుగుతుంది…

అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్ …అల్టిమేట్ స్క్రీన్ ప్రజెన్స్ తో తనకి సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపిస్తూ మాస్ స్వాగ్ తో మాస్ రచ్చ చేశాడు….ఇక అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్, నెల్సన్ టేకింగ్ రిమార్కబుల్ విజువల్స్ తో అనౌన్స్ మెంట్ వీడియో సినిమా మీద ఉన్న అంచనాలను….

అమాంతం పెంచేసింది…టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో జైలర్2 మెప్పించింది అని చెప్పాలి. హిందీలో సరిగ్గా ప్రమోట్ చేసి సినిమా ఔట్ పుట్ జైలర్ రేంజ్ లో ఉంటే కోలివుడ్ కి 1000 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here