Home న్యూస్ రెండో వీకెండ్ జోరు…7 కోట్ల లక్ష్యం….10 రోజుల్లో వచ్చింది ఇది!

రెండో వీకెండ్ జోరు…7 కోట్ల లక్ష్యం….10 రోజుల్లో వచ్చింది ఇది!

0

   సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో రెండో హిట్ గా నిలిచిన సినిమా 118, నందమూరి కళ్యాణ్ రామ్ శాలిని పాండే మరియు నివేద థామస్ ల కాంబినేషన్ లో కే వి గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుని తొలి వీకెండ్ లో మంచి వసూళ్ళ ని సాధించి తర్వాత కూడా స్లో డౌన్ అవ్వకుండా…

వర్కింగ్ డేస్ లో కూడా జోరు చూపగా సినిమా మొత్తం మీద మొదటి వీక్ లో రెండు రాష్ట్రాలలో 8 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 9.15 కోట్ల దాకా షేర్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో మొత్తం మీద…

మంచి వసూళ్ళ నే అందుకుని సత్తా చాటుకుంది, 8 వ రోజు సినిమా 30 లక్షల షేర్ ని, 9 వ రోజు 32 లక్షల షేర్ ని ఇక 10 వ రోజు ఆది వారం లో 41 లక్షల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది, దాంతో 10 రోజులకు గాను రెండు రాష్ట్రాలలో 118 సినిమా

8.75 కోట్ల వరకు షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో వీకెండ్ లో సినిమా 1.13 కోట్ల దాకా షేర్ ని అందుకుంది, దాంతో 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 10.26 కోట్ల మార్క్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 19 కోట్ల కి అటూ ఇటూ గా ఉంటుందని సమాచారం.

సినిమా ని టోటల్ గా 6.3 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ఇక రెండో వారం వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే 12 కోట్ల కి పైగా షేర్ ని లాంగ్ రన్ లో అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here