ఇది కదా న్యూస్ అంటే…కాచుకోండి…2 రోజుల్లో సునామీ!

0
698

     బాహుబలి తర్వాత టాలీవుడ్ మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన సినిమా RRR.. నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే ఇద్దరు హీరోల షూటింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది.

కానీ అందరి లో సినిమా గురించిన ఆలోచనలు అలాగే కొనసాగుతున్నాయి అని చెప్పాలి, అసలు సినిమాకి ఆ డిఫెరెంట్ వర్కింగ్ టైటిల్ ఎందుకు పెట్టారు, అసలు టైటిల్ ఏంటి, సినిమా కథ పాయింట్ ఎలా ఉంటుందని, ఇద్దరు హీరోల కి సమానమైన హీరోయిజం చూయించుకునేలా…

సినిమా ఉంటుందా లేదా ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతూనే ఉన్నాయి, వీటికి కొంతవరకు పులిస్టాప్ పెట్టడానికి ఇప్పుడు రెండు రోజుల్లో సినిమా యూనిట్ నుండి మొదటి అఫీషియల్ ప్రెస్ మీట్ ఉండబోతుందని సమాచారం. ఎస్ ఎస్ రాజమౌళి స్వయంగా వచ్చేసి ఈ ప్రెస్ మీట్ లో సినిమా విశేషాలు కొన్ని రివీల్ చేయబోతున్నారట.

దాంతో పాటుగా సినిమా టైటిల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ తో పాటు ఈ నెల 27 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా RRR సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది ఇప్పుడు.

దాంతో రెండు రోజుల్లో RRR సినిమా సునామీ లెవల్ అప్ డేట్స్ తో టాలీవుడ్ మొత్తం షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా రిలీజ్ డేట్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here