యాంకర్ ప్రదీప్ హీరోగా లాంచ్ అయిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని మంచి ప్రాఫిట్స్ ని దక్కించుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో కొత్త సినిమాల కారణంగా థియేటర్స్ ని కోల్పోయింది.
అయినా కానీ ఉన్నంతలో తక్కువ థియేటర్స్ లోనే సినిమా రెండో వీకెండ్ లో స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. రెండో వీకెండ్ లో సినిమా 3 రోజుల్లో 32 లక్షల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా అందులో కేవలం 10 వ రోజే ఏకంగా…
15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి 6.86 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. టోటల్ గ్రాస్ 12 కోట్ల మార్క్ ని అందుకుంది.
సినిమా మొత్తం మీద 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.07Cr
👉Ceeded: 1.28Cr
👉UA: 83L
👉East: 50L
👉West: 39L
👉Guntur: 56L
👉Krishna: 48L
👉Nellore: 29L
AP-TG Total:- 6.40CR(11Cr Gross~)
Ka+ ROI – 22L(Updated)
OS – 24L
Total WW: 6.86Cr(12Cr~ Gross)
ఇవీ సినిమా మొత్తం మీద 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్. సినిమా మొత్తం మీద సాలిడ్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. టోటల్ గా సినిమా ను 4.4 కోట్లకు అమ్మగా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…
మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 2.06 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ఇక లాంగ్ రన్ లో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండో వారం వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ ని ఎలా సాధిస్తుందో చూడాలి…