రిలీజ్ అయిన మొదటి ఆటకే అద్బుతమైన పాజిటివ్ టాక్ తో మినిమం 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన కానీ రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో వసూళ్ళ ని అందుకోలేక పోయింది, అయినా కానీ ఎలాగోలా మొదటి వారం లో 9 కోట్లకు పైగానే షేర్ ని అందుకుంది, ఇక రెండో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ మంచి హోల్డ్ నే సాధించింది అని చెప్పాలి.
సినిమా రెండో వీకెండ్ లో సాధించిన షేర్ అద్బుతంగా ఉండటం తో సినిమా ఇప్పుడు మళ్ళీ బిజినెస్ ని అందుకునే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పాలి. ఒక సారి సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఏరియాల వారిగా గమనిస్తే…
Nizam – 4.15cr
Ceeded – 1.21cr
UA – 1.58cr
Guntur – 0.71cr
Krishna – 0.67cr
East – 0.64cr
West – 0.51cr
Nellore – 0.26cr
AP TG: 9.73cr
Ka & ROI: 0.67cr
Overseas: 0.38cr
WorldWide Share : 10.78cr(19.7Cr~Gross) ఇదీ మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రాక్షసుడు 10 రోజుల కలెక్షన్స్ లెక్కలు.
ఇక సినిమా ను టోటల్ గా 16.2 కోట్లకు అమ్మగా 17.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన షేర్ 10.78 కోట్ల షేర్ కాకుండా ఇప్పటి నుండి మరో 6.4 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, 11 వ రోజు బక్రీద్ హాలిడే తో మరో మంచి రోజును…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంజాయ్ చేసే అవకాశం ఉండటం తో సినిమా మూడో వీకెండ్ వరకు ఇలాగే స్టడీ గా ఉంటే కచ్చితంగా బిజినెస్ ని అందుకోక పోయినా కానీ ఎబో యావరేజ్ గా అయినా నిలిచే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. చూద్దాం మరి సినిమా ఏం చేస్తుందో… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.