బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ సీజన్ లో కూడా మాస్ రాంపేజ్ ని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా ఈ సినిమా ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది. తెలుగు తమిళ్ బైలింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ తెలుగు నిర్మాతే నిర్మించడంతో ఎక్కువగా తెలుగు సినిమాలానే…
ఈ సినిమాని ఆడియన్స్ ఆదరిస్తున్నారు… ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోవడంతో ధనుష్ ఖాతాలో మూడో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఇది వరకు ధనుష్ నటించిన రంజానా, తిరు చిత్రం బలం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర…
100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇక్కడ మరో విశేషం కూడా ఉంది, ధనుష్ ఈ 100 కోట్ల గ్రాస్ మార్క్ మూవీస్ ని మూడు డిఫెరెంట్ ఇండస్ట్రీలలో అందుకోవడం విశేషం. రంజానా హిందీ లో 100 కోట్లు అందుకుంటే… తిరు చిత్రం బలం తమిళ్ లో 100 కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక ఇప్పుడు చేసిన తెలుగు మూవీ సార్ తో తెలుగు లో కూడా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ధనుష్ మూడు ఇండస్ట్రీలలో రాంపేజ్ చూపించాడు, తన అప్ కమింగ్ మూవీస్ ని కూడా బాగా ప్రమోట్ చేసుకుంటే కచ్చితంగా తన మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది.