బాక్స్ ఆఫీస్ దగ్గర శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అటు తమిళ్ లో ఇటు తెలుగు లో అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 87 కోట్ల రేంజ్…
కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ దీపావళి కానుకగా ఉండబోతుందని చెప్పడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం తక్కువే అని అంతా అనుకున్నారు. సినిమా మేకర్స్ 100 కోట్ల ఆశలపై నీళ్ళు పోశారు అనుకున్నారు అందరూ…
కానీ జనాలు మాత్రం ఇప్పటికీ సినిమాను థియేటర్స్ లోనే విరగబడి చూస్తూ ఉండటంతో సినిమా లేటెస్ట్ గా నాలుగో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 100 కోట్ల రేసులో ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించింది. 24 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
సినిమా తమిళనాడులో 67 కోట్ల గ్రాస్ ను అందుకోగా తెలుగు లో 4.15 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది, కర్ణాటకలో 4 కోట్ల మేర గ్రాస్ ను అందుకోగా, కేరళలో 4 రోజుల్లో 1.05 కోట్ల గ్రాస్ ను అందుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు మరియు ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ లెక్క 18 కోట్ల రేంజ్ లో ఉందట. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు…
24 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 94.95 కోట్ల గ్రాస్ ను అందుకుంది. అంటే 100 కోట్లకు సినిమా జస్ట్ 5 కోట్లకి పైగా దూరంలోనే ఉంది… దాంతో 100 కోట్లు కష్టం అనుకున్నా తమిళనాడులో రన్ ఇప్పటికీ సాలిడ్ గా ఉండటం, కేరళలో అదరగొడుతూ ఉండటం సినిమాకి ఇప్పుడు కలిసి వస్తుంది. మరి ఈ దీపావళి వీకెండ్ లో మినిమం థియేటర్స్ దొరికినా 100 కోట్ల ఛాన్స్ పుష్పలంగా ఉందని చెప్పొచ్చు.