Home న్యూస్ కాలేజ్ డాన్ టాక్ ఏంటి…2 డేస్ కలెక్షన్స్ లెక్క ఇదే!!

కాలేజ్ డాన్ టాక్ ఏంటి…2 డేస్ కలెక్షన్స్ లెక్క ఇదే!!

0

లాస్ట్ ఇయర్ డాక్టర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సైలెంట్ గా రిలీజ్ అయ్యి సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు శివ కార్తికేయన్… తెలుగు లో కూడా పెద్దగా అంచనాలు ఏమి లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ సెన్సేషనల్ హిట్ అవ్వగా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా టోటల్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది.

అలాంటి విజయం తర్వాత శివకార్తికేయన్ నటించిన కొత్త సినిమా డాన్ తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో డబ్ అవ్వగా రిలీజ్ రోజు కి కొన్ని రోజుల ముందు తెలుగు రిలీజ్ ను కన్ఫాం చేసుకుని మినిమమ్ ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చింది… కానీ సినిమా స్టొరీ పాయింట్ ఆకట్టుకునేలా ఉండటం… ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్…

బాగా వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ తండ్రి కొడుకుల సీన్స్ అలాగే హీరో ఎస్ జే సూర్య ల సీన్స్ బాగా మెప్పించడం చివరి 20 నిమిషాలు ఎమోషనల్ గా ఆకట్టుకోవడంతో ఈజీగా ఒకసారి చూడో అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది కాలేజ్ డాన్ మూవీ…

మొత్తం మీద మరీ అద్బుతం కాదు కానీ బాగుంది అనిపించిన సినిమా తమిళనాడులో మొదటి రోజు 9 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా రెండో రోజు కూడా ఆల్ మోస్ట్ అదే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మినిమమ్ పబ్లిసిటీ లేకున్నా కానీ ఫస్ట్ డే 20 లక్షల గ్రాస్ ను రెండో రోజు 30 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకుని 2 రోజుల్లో 50 లక్షలకు పైగా గ్రాస్ ను సాధించింది.

మొత్తం మీద సినిమా 2 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా…. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్న శివకార్తికేయన్ ఈ సినిమా తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుండగా తెలుగు లో కొంచం పబ్లిసిటీ చేసి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here