ఈ ఇయర్ సమ్మర్ ఎండ్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన మహారాజ(Maharaja Movie) సినిమా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న హీరోకి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్ అండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది…
టోటల్ రన్ లో ఏకంగా 104 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా రీసెంట్ గా చైనాలో రిలీజ్ అయ్యింది…ఏకంగా 40 వేలకు పైగా స్క్రీన్స్ లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా అక్కడ సినిమా రేంజ్ కి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది…
సినిమా ప్రీమియర్స్ తో ఇండియన్ కరెన్సీలో 5.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజున సినిమా 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.ఇక రెండో రోజున సినిమా సాలిడ్ గా జోరు చూపించి 9.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా…
మూడు నాలుగు రోజుల్లో సినిమా మంచి హోల్డ్ నే కొనసాగించి 10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని మంచి జోరుతో పరుగును కొనసాగిస్తుంది. సినిమా ఓవరాల్ గా 29 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా… ఇప్పుడు 5వ రోజు సాధించే కలెక్షన్స్ తో 30 కోట్ల గ్రాస్ మార్క్ ని…
అక్కడ అందుకోబోతూ ఉండగా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా వరల్డ్ వైడ్ గా 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుంది…లాంగ్ రన్ లో సినిమా చైనాలో ముందు 300 కోట్ల రేంజ్ లో ఎక్స్ పెర్టేషన్స్ ను పెట్టుకున్నా ఇప్పుడు 100 కోట్ల మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ అంచనాలను సినిమా మించిపోతుందో లేదో చూడాలి.