బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ తమిళ్ నుండి మంచి హిట్ గా నిలిచిన సినిమాల్లో ఎక్స్ పెరిమెంటల్ మూవీ తోనే మాస్ హిట్ ను సొంతం చేసుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందిన మహారాజ(Maharaja Movie) సినిమా టోటల్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ తో విజయ్ సేతుపతి కెరీర్ లోనే…
ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….టోటల్ రన్ లో 104 కోట్ల వసూళ్ళతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా రీసెంట్ గా చైనాలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది….మొదటి వారంలో సినిమా ఓవరాల్ గా 40.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా మరింత జోరు చూపించి ఏకంగా 23.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
ఓవరాల్ గా సినిమా 10 రోజుల్లో ఓవరాల్ గా చైనాలో 7.60 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని అందుకుని ఓ రేంజ్ లో కుమ్మేసింది….ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా సినిమా 64.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని అక్కడ ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంది.
ఓవరాల్ గా చైనాలో సాధించిన కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా ఇప్పటి వరకు 168 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని 175 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో చైనాలో సాధించే కలెక్షన్స్ తో 200 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. కోలివుడ్ తరుపున అక్కడ ఊరమాస్ కలెక్షన్స్ తో సినిమా రికార్డ్ సృష్టించింది….