Home న్యూస్ పుష్ప 2 10 డేస్ టికెట్ సేల్స్…..ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఇది!!

పుష్ప 2 10 డేస్ టికెట్ సేల్స్…..ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie)….అన్ని చోట్లా రికార్డుల భీభత్సం సృష్టిస్తూ ఉండగా సినిమా కలెక్షన్స్ పరంగా మాస్ రికార్డులు నమోదు చేస్తూ ఉండగా….

మరో పక్క టికెట్ సేల్స్ పరంగా కూడా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ దిశగా దూసుకు పోతూ ఉంది…లేటెస్ట్ గా సినిమా ఈ ఇయర్ కి గాను హైయెస్ట్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఇదే క్రమంలో…

ఆల్ టైం హైయెస్ట్ టికెట్ సేల్స్ తో ఊచకోత కోసిన ఇతర సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తుంది….సినిమా రీసెంట్ గా కల్కి మూవీ 13.14 మిలియన్ టికెట్ సేల్స్ ను బుక్ మై షోలో సొంతం చేసుకుని ఈ ఇయర్ రికార్డ్ టికెట్ సేల్స్ ను అందుకోగా…

Pushpa 2 The Rule 9 Days Total WW Collections Report!!

ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి 10వ రోజు ఒక్క రోజే ఏకంగా 1.1 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది సినిమా…ఇక ఇండియన్ ఎపిక్ హిట్స్ లో ఒకటైన ఆర్ ఆర్ ఆర్ 13.4 మిలియన్ టికెట్ సేల్స్ ను క్రాస్ చేసిన సినిమా…

10 రోజుల్లో ఓవరాల్ గా 14.41 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు….ఓవరాల్ గా బుక్ మై షో లో ఆల్ టైం హైయెస్ట్ ఫాస్టెస్ట్ 14 మిలియన్ టికెట్ సేల్స్ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసిన పుష్ప2 మూవీ….

ఇక మిగిలిన రన్ లో 2 సినిమాల రికార్డ్ టికెట్ సేల్స్ ను అందుకుంటుందో లేదో చూడాలి…బాహుబలి2 మూవీ 16 మిలియన్ టికెట్ సేల్స్ ని అందుకోగా టాప్ ప్లేస్ లో కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 17.10 మిలియన్ టికెట్ సేల్స్ ను అందుకుంది…ఇక పుష్ప2 ఎన్ని రోజుల్లో ఈ సినిమాల టికెట్ సేల్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here