Home న్యూస్ 10 నిమిషాల్లో 1 మిలియన్…32 నిమిషాల్లో 500K…ఇదే అరాచకం…అయినా రికార్డ్ కొట్టలేదు!

10 నిమిషాల్లో 1 మిలియన్…32 నిమిషాల్లో 500K…ఇదే అరాచకం…అయినా రికార్డ్ కొట్టలేదు!

0

కోలివుడ్ లో సోషల్ మీడియా రికార్డుల విషయంలో స్టార్ వార్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, అక్కడ విజయ్ మరియు అజిత్ ల సినిమాల విషయంలో కలెక్షన్స్ పరంగానే కాదు, సోషల్ మీడియా రికార్డుల విషయంలో కూడా ఎప్పుడూ పోటి జరుగుతూనే ఉంటుంది కానీ రీసెంట్ టైం లో విజయ్ రికార్డుల విషయంలో కలెక్షన్స్ విషయంలో ఫుల్ డామినేట్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండగా అజిత్ కుమార్ మూవీస్ కంటెంట్ కరెక్ట్ గా…

ఉన్నప్పుడు సంచలనాలు నమోదు చేశాయి, ఇక అజిత్ కుమార్ విశ్వాసం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న కొత్త సినిమా వలిమై ఆడియన్స్ ముందు ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు…

తీసుకు రాగా ఆడియన్స్ నుండి సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో సొంతం అవుతుంది అని చెప్పాలి. కాగా సినిమా ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో కేవలం 10 నిమిషాల టైం కే యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. అలాగే రిలీజ్ అయిన…

32 నిమిషాల టైం కే 500K మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించి, ఇవేం రికార్డులు రా బాబు అనుకునేలా చేసినా కానీ కొత్త రికార్డులను మాత్రం అందుకోలేదు. విజయ్ నటించిన బిగిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 1 నిమిశానికే 1 లక్ష లైక్స్ ని అందుకోగా 14 నిమిషాల టైం కే 5 లక్షల లైక్స్ ని 1 గంట లో ఏకంగా 1 మిలియన్ మార్క్ ని అందుకుని…

అసలు సిసలు ఊచకోత అంటే ఇదే అనిపించుకుంది. కానీ వ్యూస్ పరంగా ఎంత సేపట్లో 1 మిలియన్ ని అందుకుంది అన్నది మాత్రం కరెక్ట్ గా చెప్పలేదు. ఓవరాల్ గా అజిత్ కుమార్ వలిమై ట్రైలర్ సంచలన రికార్డులతో సౌత్ లో ఇప్పుడు టాప్ 2 తో దుమ్ము లేపుతుంది కానీ 24 గంటల్లో ఓవరాల్ గా కొత్త రికార్డులను అందుకుంటుందో లేదో అనేది చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here