అద్బుతమైన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) సినిమా, రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ లేపుతూ ఉండగా 9వ రోజున సెన్సేషనల్ కలెక్షన్స్ తో…
దుమ్ము దుమారం లేపగా….10వ రోజులో అడుగు పెట్టిన సినిమా సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ మాస్ భీభత్సం సృష్టిస్తుంది…తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ…
దుమ్ము దుమారం లేపుతూ ఉండగా నైట్ షోల ట్రెండ్ కూడా సాలిడ్ గా ఉంటే సినిమా 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడులో ఈ రోజు ఊరమాస్ ట్రెండ్ ను చూపెడుతూ….
దూసుకు పోతూ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా…
ఓవరాల్ గా 10వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 12.5-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 100 కోట్ల గ్రాస్ తో హీరో కెరీర్ లో రికార్డ్ ను నమోదు చేసింది. ఇక టోటల్ గా 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.