బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన జాతిరత్నాలు సినిమా రెండో వారం లో కూడా సూపర్ సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేయడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కొత్త సినిమాలు అన్నీ కూడా ఓ రేంజ్ లో డామినేట్ చేసి అల్టిమేట్ లీడ్ తో రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా రెండో వీకెండ్ ఆదివారం రోజున…
మిగిలిన మూడు కొత్త సినిమాలు కలిపి సాధించిన కలెక్షన్స్ చూసుకున్నా డబుల్ మార్జిన్ తో లీడ్ చూపిన జాతిరత్నాలు సినిమా ఏకంగా 2.15 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 34 కోట్ల రేంజ్ కి షేర్ ని అందుకోగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా 56 కోట్ల వరకు గ్రాస్ ని దక్కించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ ను దగ్గర భారీ పోటి ని రిలీజ్ అయిన వారం లో అలాగే రెండో వారం లో కూడా సొంతం చేసుకున్నా కానీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి.
ఇక సినిమా మొత్తం మీద 11 రోజులు పూర్తీ అయిన తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 14.15Cr
👉Ceeded: 3.64Cr
👉UA: 3.55Cr
👉East: 1.72Cr
👉West: 1.37Cr
👉Guntur: 1.88Cr
👉Krishna: 1.62Cr
👉Nellore: 83L
AP-TG Total:- 28.76CR (45.90Cr Gross~)
KA+ROI – 1.42Cr( Corrected )
OS – 3.78Cr~
Total: 33.96CR(55.9Cr+ Gross)
సినిమాను టోటల్ గా 11 కోట్లకు అమ్మగా 11.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల తర్వాత 22.46 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సత్తా చాటుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి గా మారింది.