నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది, తొలి మూడు షోలు ఒకెత్తు అయితే నైట్ షోల లో సినిమా గ్రోత్ మరో ఎత్తు అని చెప్పాలి. దాంతో సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకో గలిగింది. ఇక సినిమా…
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తి గా మారగా అన్ సీజన్ ఎఫెక్ట్ కొనసాగుతుంది, తొలి రెండు షోల కి సినిమా మొదటి రోజు తో పోల్చితే మంచి గ్రోత్ తోనే హోల్డ్ చేసి ఈవినింగ్ అండ్ నైట్ షోలకి…
మంచి అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంటూ రెండో రోజు ని బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే వాడుకునే అవకాశం ఉందని చెప్పాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేక పోయినా కానీ సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం పాజిటివ్ టాక్ పవర్ అనే చెప్పాలి.
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఇదే లెవల్ లో ట్రెండ్ ని కొనసాగిస్తే రెండో రోజు ముగిసే సరికి సినిమా 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే పక్కా ఉందని చెప్పాలి. అన్ సీజన్ అండ్ లో బజ్ లో ఈ సినిమా ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి.
ఒకవేళ గ్రోత్ ఎక్కువగా ఉంటె కచ్చితంగా సినిమా 1.2 కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ 30% లోపే ఉండే లా కనిపిస్తుండటంతో సినిమా వీకెండ్ లో కుమ్మేసే కలెక్షన్స్ అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.