Home న్యూస్ 118 ఫస్ట్ డే ఓపెనింగ్స్…షాకింగ్!

118 ఫస్ట్ డే ఓపెనింగ్స్…షాకింగ్!

0

     నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118, నివేద థామస్ మరియు శాలిని పాండే హీరోయిన్స్ గా కే వి గుహన్ డైరెక్షన్ లో ఎస్ కే ఎం కోనేరు నిర్మాత గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాకే లభించింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఎలాంటి జోరు చూపుతుందా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు.

కానీ సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత షాకింగ్ ఓపెనింగ్స్ లభించాయి అని చెప్పొచ్చు, ప్రస్తుతం అన్ సీజన్ నడుస్తుండటం, కళ్యాణ్ రామ్ పెద్దగా ఫామ్ లో లేక పోవడం సినిమా పై కూడా పెద్దగా బజ్ లేక పోవడం లాంటి ఎఫెక్ట్ లు సినిమా పై ప్రభావం చూపాయి.

దాంతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ ఆక్యుపెన్సీ 10% కి అటూ ఇటూ గా ఉందని సమాచారం, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాక్ బాగున్నా తొలి రెండు షోలు ఎఫెక్ట్ చూపడం తో ఈవినింగ్ అండ్ నైట్ షోల లో గ్రోత్ భారీ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

అలా ఉంటె తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ రేంజ్ ని బట్టి చూస్తె మాత్రం తొలిరోజు రెండు రాష్ట్రాలలో సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం తక్కువే అని చెప్పాలి.

తొలిరోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా ప్రస్తుతం ఓపెనింగ్స్ ఉన్నాయి, మరి ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి గ్రోత్ ఎలా ఉంటుంది అన్న దాని పై తొలిరోజు కలెక్షన్స్ ఎంత రావచ్చు అన్నది ఒక ఐడియా ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here