118 రివ్యూ-రేటింగ్…ప్లస్&మైనస్ పాయింట్స్ ఇవే!

4
799

       నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ నుండి మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల కి అసలు టాక్ బయటికి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ. ముందుగా కథ పాయింట్ గురించి వస్తే TV రిపోర్టర్ గా పని చేసే హీరో తను ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉంటాడు.

అనుకోకుండా తనకి కలలో ఒక అమ్మాయి ఆపదలో ఉందని, తనని రక్షించమని అంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, ఇది కలనా లేక నిజమా అని అన్వేషించే హీరో ఫైనల్ గా ఈ సమస్య కి ఎలాంటి పరిక్షారం కనుగొన్నాడు అన్నాడు అసలు పాయింట్…

ప్లస్ పాయింట్స్:-
*కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ అండ్ న్యూ లుక్
*నివేద థామస్ పెర్ఫార్మెన్స్
*ఎంగేజింగ్ అండ్ రేసీ ఫస్టాఫ్
* బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ రిచ్ సినిమాటోగ్రఫీ
* ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్…. ఓవరాల్ గా సినిమా లో ఇవి మేజర్ గా ప్లస్ పాయింట్స్ గా నిలిచి ఆకట్టుకున్న అంశాలు అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్: –
*ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచం వీక్ గా ఉండటం
*రొటీన్ క్లైమాక్స్
*సెకెండ్ ఆఫ్ కొంచం ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటం.
మొత్తం మీద సినిమా లో మేజర్ మైనస్ పాయింట్స్ గా ఇవి చెప్పుకోవచ్చు. ఇవి తప్పితే సినిమాలో చాలా వరకు ఆకట్టుకున్న అంశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఫైనల్ గా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి, సరికొత్త కాన్సెప్ట్ మూవీస్ చూసేవారికి ఎక్కువగా నచ్చుతుంది, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవారు ఒకసారి చూసే విధంగా ఉంటుంది. రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ లో పటాస్ తర్వాత బెస్ట్ అంటే మాత్రం ఇదే అని చెప్పాలి.

కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఉన్నంతలో రీసెంట్ టైం లో మంచి సినిమాతో అలరించాడు కళ్యాణ్ రామ్.. ఇక బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్… మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!