బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీ బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో కూడా సొంతం చేసుకుని లాంగ్ రన్ లో పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు లేక పోవడంతో ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 11వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో కొంచం ఎక్కువగానే డ్రాప్ అయినా కానీ ఆల్ రెడీ..
భారీ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 11వ రోజు 18 లక్షల రేంజ్ లో షేర్ ని 34 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 11 రోజుల తెలుగు హిందీ కలిపి గ్రాస్ 29.50 కోట్ల మార్క్ ని అందుకుంది.
ఇక తెలుగు వర్షన్ 11 డేస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 5.78Cr
👉Ceeded: 1.36Cr
👉UA: 1.39Cr
👉East: 92L
👉West: 59L
👉Guntur: 1.03Cr
👉Krishna: 61L
👉Nellore: 41L
AP-TG Total:- 12.09CR(22.91Cr~ Gross)
మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 6.59 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్షన్స్ కలుపుకుని టోటల్ గ్రాస్ లెక్క 29.50 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి.