Home న్యూస్ 12.5 కోట్ల టార్గెట్….రిపబ్లిక్ 3 డేస్ కలెక్షన్స్ ఇవే!!

12.5 కోట్ల టార్గెట్….రిపబ్లిక్ 3 డేస్ కలెక్షన్స్ ఇవే!!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాను 13.6 కోట్లకు అమ్మగా ఒకవేళ ఆ బిజినెస్ రికవరీ అయ్యేలా లేకుంటే 1.6 కోట్లు వెనక్కి ఇచ్చే అగ్రిమెంట్ తో బయ్యర్లు కొనగా ఇప్పుడు వీకెండ్ తర్వాత అలాగే జరిగింది… దాంతో ఇప్పుడు బిజినెస్ 12 కోట్లు అవ్వగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను సినిమా…

యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ తో ముగించింది. మూడో రోజు 90-1 కోటి రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావించగా సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగానే ఇంప్రూవ్ అవ్వడంతో మొత్తం మీద రోజు ని 1.2 కోట్ల షేర్ మార్క్ ని…

అందుకుని ముగించింది, ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 3 వ రోజున ఓవరాల్ గా 1.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. దాంతో మూడో రోజు వరకు బాగానే కలెక్షన్స్ వచ్చినా కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ దృశ్యా చూసుకుంటే వర్కింగ్ డేస్ లో చాలా గట్టిగా సినిమా హోల్డ్ చేయాల్సి ఉంటుంది.

ఇక సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ కి గాను సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.39Cr
👉Ceeded: 87L
👉UA: 61L
👉East: 33L
👉West: 32L
👉Guntur: 37L
👉Krishna: 32L
👉Nellore: 24L
AP-TG Total:- 4.45CR(7.40CR~ Gross)
Ka+ROI: 24L
OS – 38L
Total WW: 5.07CR(9.35CR~ Gross)
ఇదీ వీకెండ్ కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్.

ఇప్పుడు 12 కోట్ల బిజినెస్ కి 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అవ్వడంతో మొదటి వీకెండ్ తర్వాత సినిమా ఇంకా 7.43 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంది, అంటే వర్కింగ్ డేస్ లో ఏమాత్రం జోరు తగ్గకుండా సినిమా కలెక్షన్స్ కొనసాగితే తప్పితే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here