యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో సెకెండ్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా ఇప్పుడు 11 వ రోజు కొంచం ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా 12వ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో ఉన్నంతలో…
మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకోకుండా ఆల్ మోస్ట్ 11 వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 4 కోట్ల నుండి 4.5 కోట్ల లోపు షేర్ ని అందుకుంటుంది అని అంచనా వేసినా…
మొత్తం మీద 4.88 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని దక్కించుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 12 వ రోజు 11 కోట్ల నుండి 11.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా సినిమా 11.58 కోట్ల షేర్ ని సాధించింది…
ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 101.36Cr
👉Ceeded: 46.55Cr
👉UA: 31.61Cr
👉East: 14.36Cr
👉West: 12.00Cr
👉Guntur: 16.77Cr
👉Krishna: 13.40Cr
👉Nellore: 8.31Cr
AP-TG Total:- 244.36CR(367.00CR~ Gross)
👉KA: 38.70Cr
👉Tamilnadu: 34.90Cr
👉Kerala: 9.75Cr
👉Hindi: 97.10Cr
👉ROI: 7.55Cr
👉OS – 88.70Cr
Total WW: 521.06CR(Gross- 938.50CR~)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 938 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపగా సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 68.06 కోట్ల ప్రాఫిట్ తో హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…