యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కి చాలా కాలం తర్వాత వరుస ఫ్లాఫ్స్ నుండి ఆడియన్స్ మంచి టాక్ ని ఇచ్చిన సినిమా గా చెప్పుకోవాలి, సినిమా ఆడియన్స్ ను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను మెప్పించగా ఆంధ్రలో పరిస్థితుల వలన 50% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ నే రిపోర్ట్ చేస్తూ రావాడం తో లాంగ్ రన్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి ఓవరాల్ గా…
బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది. టోటల్ రన్ లో సినిమా 92% వరకు రికవరీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సొంతం చేసుకోగా సినిమా ఓవరాల్ గా ఎబో యావరేజ్ గా పరుగును ముగించింది, 100% ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసి ఉన్నా లేక టికెట్ రేట్లు…
నార్మల్ గా ఉన్నా కానీ సినిమా సూపర్ హిట్ రిజల్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ఉండేది, కానీ అలా జరగలేదు కాబట్టి సినిమా టోటల్ రన్ ని కొంచం నష్టాల తోనే ముగించింది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 2.77Cr
👉Ceeded: 2.06Cr
👉UA: 1.54Cr
👉East: 1.09Cr
👉West: 65L
👉Guntur: 1.13Cr
👉Krishna: 65L
👉Nellore: 54L
Total AP TG: 10.44CR(17.62CR~ Gross)
👉KA+ROI: 46L
👉OS: 12L~(No release in USA)
TOTAL Collections: 11.02CR(18.85CR~ Gross)
ఇదీ సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క..
సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో 98 లక్షల దాకా నష్టపోయి ఎబో యావరేజ్ గా నిలిచింది, సినిమా అయితే హిట్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గరే బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది… కానీ గోపీచంద్ కి మాత్రం మంచి కంబ్యాక్ మూవీ లా నిలిచింది ఈ సినిమా…