బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ప్రతీ రోజూ కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా రెండో వీకెండ్ కొంచం లేట్ గా వచ్చినా కూడా 12వ రోజున సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ భీభత్సం సృష్టించింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకుంటే ఏకంగా 12వ రోజున 4.90 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించగా…
12వ రోజున టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 4.88 కోట్ల షేర్ తో టాప్ 2 ప్లేస్ లో ఉంటే…ఆర్ ఆర్ ఆర్ ని క్రాస్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ 4.90 కోట్ల షేర్ ని అందుకుని 12వ రోజు ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను అందుకుంది…
ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి2 మూవీ ఇప్పటికీ టాప్ ప్లేస్ లో 5.49 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మీడియం బడ్జెట్ మూవీ బిగ్ పాన్ ఇండియా మూవీస్ కి ధీటుగా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం కాగా ఓవరాల్ గా…
12వ రోజున టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 12th Day Highest Share Movies
👉#Baahubali2 – 5.49Cr
👉#SankranthikiVasthunam – 4.90CR******
👉#RRR- 4.88CR
👉#Pushpa2TheRule- 3.07CR
👉#Syeraa- 2.98Cr
👉#KhaidiNo150: 2.95Cr
👉#GeethaGovindam – 2.90Cr
👉#Baahubali – 2.76CR~
👉#HanuMan – 2.48Cr
👉#JaiLavaKusa – 2.40Cr
👉#SoggadeChinninayana : 2.21Cr~
👉#Devara Part 1 – 2.16Cr
👉#BharatAneNenu : 2.15Cr~
మొత్తం మీద అన్నీ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ మధ్యలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ మాస్ భీభత్సం సృష్టించింది. ఇక సినిమా 13వ రోజున సండే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో మరింత రెచ్చిపోయే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.