మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ కుమ్ముడు కుమ్మేసి రెండో వీక్ లో కొంచం స్లో అయినా కూడా ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ ఇప్పుడు సాలిడ్ లాభాలను సొంతం చేసుకుంటూ 13 రోజుల్లో ఓవరాల్ గా 66 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…
ఇక 12వ రోజు తో పోల్చితే 13వ రోజున మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న సినిమా 4 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 34 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 39 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
80 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది…. ఓవరాల్ గా స్టడీ గా లాభాలను పెంచుకుంటూ రన్ ని కొనసాగిస్తున్న సినిమా ఈ వీక్ లో కొత్త సినిమాల ఫ్లో వలన కొంచం స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద మ్యాడ్ 2 మూవీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
MAD Square Movie 13 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 12.95Cr
👉Ceeded: 3.81Cr
👉UA: 3.68Cr
👉East: 2.23Cr
👉West: 1.20Cr
👉Guntur: 2.07Cr
👉Krishna: 1.74Cr
👉Nellore: 1.02Cr
AP-TG Total:- 28.70CR(48.45CR~ Gross)
👉KA+ROI: 2.10Cr
👉OS – 6.13Cr****approx
Total WW Collections: 36.93CR(Gross – 66.40CR~)
మొత్తం మీద 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 14.93 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.