మన స్టార్ హీరోలు ఒకప్పటిలా వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు…అందరూ పాన్ ఇండియా మోజులో ఒక్కో సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటూ ఉండటంతో టాప్ స్టార్స్ నటించే సినిమాలు చాలా తక్కువగానే ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్న ఈ టైంలో లాస్ట్ ఏడాదిన్నర గ్యాప్ లో చూసుకుంటే మిగిలిన హీరోల కన్నా కూడా..
భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తూనే ఎక్కువ రిలీజ్ లను సొంతం చేసుకున్న స్టార్ గా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సంచలనం సృష్టించాడు…లాస్ట్ ఇయర్ జూన్ నుండి ఈ ఇయర్ జూన్ 13 నెలల గ్యాప్ లో మొత్తం మీద 3 బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ ని…
ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి రెబల్ స్టార్ సంచలనం సృష్టించాడు…కాగా ఈ మూడు సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఓవరాల్ గా మమ్మోత్ 2025 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి చరిత్రలో నిలిచి పోయే రికార్డ్ ను తెలుగు సినిమా హిస్టరీలో సొంతం చేసుకున్నాడు ప్రభాస్…
లాస్ట్ ఇయర్ జూన్ లో వచ్చిన ఆదిపురుష్(AdiPurush) మూవీ టోటల్ రన్ లో 397 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది…అల్టిమేట్ ఓపెనింగ్స్ తర్వాత విపరీతమైన ట్రోల్స్ వలన అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా కల్కి రేంజ్ లో టాక్ వచ్చి ఉంటే అప్పుడే రికార్డులు మరో లెవల్ లో సొంతం అయ్యి ఉండేవి.
ఇక ఇయర్ ఎండ్ లో వచ్చిన సలార్(Salaar Movie) మూవీ 630 కోట్ల గ్రాస్ ను అందుకుంది, రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి క్లాష్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్స్ మరో లెవల్ లో వచ్చి ఉండేవి… ఇక ఈ ఇయర్ 3 నెలల అన్ సీజన్ తర్వాత టాలీవుడ్ కి తిరిగి..
ఊపిరి పోసిన కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1000 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేయగా మూడు సినిమా టోటల్ గ్రాస్ లెక్క ఇప్పుడు ఓవరాల్ గా 2027 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డ్ ను సొంతం చేసుకుంది…
మిగిలిన హీరోలు ఈ ఏడాదిన్నర గ్యాప్ లో ఒకటి కి మించి సినిమాలు రిలీజ్ చేయలేదు. కొందరు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రం థియేటర్స్ కి జనాలను రప్పించి 2 వేల కోట్లకు పైగా వసూళ్ళతో ఊహకందని ఊచకోత కోశాడు… బిగ్గెస్ట్ టాలీవుడ్ స్టార్ గా నిలిచాడు.