బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. సినిమా కి 13వ రోజున అన్ని చోట్లా అంచనాలను అన్నీ కూడా మించి పోయే..
రేంజ్ లో కలెక్షన్స్ సొంతం అయ్యాయి….ఎక్స్ పెర్టేషన్స్ ను పూర్తిగా మించి పోయిన సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది….13వ రోజున ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపేసింది…
ఇది వరకు 2017 టైంలో వచ్చిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అయిన బాహుబలి2 మూవీ 4.68 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆల్ మోస్ట్ 8 ఏళ్ల టైం వరకు ఈ సినిమా రికార్డ్ అలానే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు సండే అడ్వాంటేజ్ కలిసి రావడంతో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలను మించి పోతూ ఏకంగా 7 కోట్లకు పైగానే షేర్ ని 13వ రోజున షేర్ ని అందుకుందని అంచనా…ఫైనల్ లెక్కలు ఇంకొంచం మించి పోయే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రీవియస్ ఇండస్ట్రీ రికార్డ్ ను ఇప్పుడు…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…ఎంత సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా 13 వ రోజున టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం మాస్ ఊచకోత కోసింది…