బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. రెండో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ తోనే హోల్డ్ చేసిన సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అవ్వక తప్పలేదు అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో 13వ రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఇప్పుడు….
14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 30% వరకు డ్రాప్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు మొత్తం మీద ట్రెండ్ ని బట్టి చూస్తుంటే 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఫైనల్ కలెక్షన్స్…
35 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా బెటర్ గా సినిమా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ 2 వీక్స్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.