రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో అంచనాలను మించి మిక్సుడ్ టాక్ తోనే బ్రేక్ ఈవెన్ ను అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా…
రెండో వారాన్ని ఇప్పుడు ఘనంగా పూర్తి చేసుకోబోతుంది. సినిమా 12-13 రోజులు వర్కింగ్ డేస్ అయినా కూడా వినాయక నిమజ్జనం అలాగే మొహర్రం పండగ లు కొద్ది వరకు కలిసి వచ్చి తమిళనాడులో రిమార్కబుల్ హోల్డ్ ని చూపించగా 14 వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో…
కొంచం డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా కి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన టాక్ కి ఎక్స్ లెంట్ గానే జోరు చూపిస్తుంది అని చెప్పాలి. సినిమా 14వ రోజు తమిళ్ లో ఇప్పుడు అటూ ఇటూగా 2.5-3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్ల మార్క్ కి వెళ్ళొచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
ఓవరాల్ గా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లో మార్పులు ఉండొచ్చు కానీ సినిమాకి వచ్చిన టాక్ కి రెండో వారం ఎండ్ లో కూడా ఇలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా టోటల్ గా 2 వారాల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.