Home గాసిప్స్ ఆల్ మోస్ట్ కన్ఫాం….150 కోట్ల బ్లాక్ బస్టర్ రీమేక్ లో రవితేజ!!

ఆల్ మోస్ట్ కన్ఫాం….150 కోట్ల బ్లాక్ బస్టర్ రీమేక్ లో రవితేజ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ప్రస్తుతం తన ఆశలు అన్నీ ఈగిల్(Eagle Movie) మీద పెట్టుకోగా ఫిబ్రవరిలో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఈ సినిమా తర్వాత రవితేజ తనతో…

షాక్ మరియు మిరపకాయ్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్(MR Bachchan Movie) చేస్తూ ఉండగా ఆ సినిమా గురించి కొన్ని రోజులుగా టాలీవుడ్ లో కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉండగా ఇప్పుడు అవి ఆల్ మోస్ట్ నిజమే అని తెలుస్తుంది. ఈ సినిమా బాలీవుడ్ లో…

అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్(Raid Movie) రీమేక్ గా తెరకెక్కబోతుంది అని సమాచారం…దీన్ని మేకర్స్ అఫీషియల్ గా కన్ఫాం అవ్వకపోయినా కూడా రీసెంట్ గా అజయ్ దేవగన్ రైడ్ మూవీకి సీక్వెల్ గా రైడ్2 ను స్టార్ట్ చేయగా రవితేజతో పాటు హరీష్ శంకర్ అక్కడ పాల్గొని సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు…

దాంతో సినిమా రీమేక్ ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు. రైడ్ మూవీ టోటల్ రన్ లో 153 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి హిట్ గా నిలిచింది, సీరియస్ స్టోరీ పాయింట్ తో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే తెలుగు రీమేక్ ఉండబోతుంది అని వార్తలు వచ్చినా చాలా టైం అవి రూమర్స్ గానే ఉండగా…

ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా రీమేక్ తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు మార్పులు చేర్పులతో ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్ రెడీ హిట్ అయిన మూవీస్ ని రీమేక్ తో మరింత ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేసే హరీష్ శంకర్ ప్రస్తుతం వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న రవితేజకి ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ని ఇస్తాడో ఇవ్వడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here