Home న్యూస్ అక్కడ దెబ్బ పడినా…..ఇక్కడ No1 తో రవితేజ మాస్ రచ్చ!

అక్కడ దెబ్బ పడినా…..ఇక్కడ No1 తో రవితేజ మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయిన మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) పర్వాలేదు అనిపించే రేంజ్ లో రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా అన్ సీజన్ ఇంపాక్ట్ వలన ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అయితే అందుకోలేక పోయింది అని చెప్పాలి…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును త్వరగానే కంప్లీట్ చేసుకోగా సినిమా రన్ కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది, ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా సినిమాలో హీరో ఎలివేషన్ సీన్స్ అలాగే ఓవరాల్ గా సినిమా క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటమతో…

Raviteja Eagle 3 Days Total WW Collections!

ఇక్కడ సినిమాకి రెస్పాన్స్ సాలిడ్ గానే వస్తూ ఉండగా ప్రైమ్ వీడియోలో సినిమా సాలిడ్ గా ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండగా రిలీజ్ అయిన రోజునే సినిమా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అవ్వగా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది సినిమా…

థియేటర్స్ లో సినిమా అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయినా కూడా ఇక్కడ డిజిటల్ లో మాత్రం సాలిడ్ రెస్పాన్స్ తో పాటు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి. అదే టైంలో సినిమాను కొంచం మంచి టైం చూసుకుని రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ కూడా బెటర్ గా ఉండి ఉండేది.

Raviteja Eagle 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here