Home న్యూస్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ రివ్యూ…..ఇలా ఉంది ఏంటి సామి!

టిల్లు స్క్వేర్ ట్రైలర్ రివ్యూ…..ఇలా ఉంది ఏంటి సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన డిజే టిల్లు(Dj Tillu) మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) అనౌన్స్ మెంట్ నుండి సాలిడ్ గా అంచనాలు పెరిగేలా చేసింది, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఎక్స్ పెర్టేషన్స్ ను పెంచేయగా తర్వాత టీసర్ అండ్ సాంగ్స్ రిలీజ్ ల తర్వాత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఇక ఇప్పుడు సినిమా మార్చ్ 29న రిలీజ్ కానుండగా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు, ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం, ట్రైలర్ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. డిజే టిల్లు మూవీ లో కొంచం యూత్ కి నచ్చే సీన్స్ తో పాటు కామెడీ బాగా వర్కౌట్ అయింది…

కానీ టిల్లు స్క్వేర్ ట్రైలర్ విషయానికి వస్తే కొంచం అడల్ట్ కంటెంట్ డోస్ మరీ పెంచినట్లు అనిపించగా ట్రైలర్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా తర్వాత సీన్స్ అన్నీ కూడా అనుకున్న విధంగా అయితే లేవనే చెప్పాలి. కామెడీ సీన్స్ కూడా ట్రైలర్ లో పెద్దగా చూపించలేదు, కేవలం హీరో హీరోయిన్స్ ల మధ్య కెమిస్ట్రీ సీన్స్ ను…

ఎక్కువగా ఫోకస్ చేసి చూపించడం యూత్ కి ఎక్కువగా నచ్చొచ్చు ఏమో కానీ సినిమాలో కూడా ఇవే సీన్స్ ఎక్కువగా ఉంటే డిజే టిల్లు లాగా ఎక్కువ సెక్షన్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం తగ్గుతుంది…. ఓవరాల్ గా ట్రైలర్ యూత్ వరకు పర్వాలేదు కానీ….కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె మాత్రం…..

మొదటి పార్ట్ ట్రైలర్ రేంజ్ తో పోల్చితే జస్ట్ ఓకే అనిపించేలా ఉందని చెప్పాలి, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మెయిన్ కథ అండ్ కంటెంట్ ఆడియన్స్ కి నచ్చితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టవచ్చు… మరి సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here