బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ, సోలో హీరోగా బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు…
కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు 3వ వీకెండ్ దసరా పండగ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేయగా ఆల్ రెడీ లాభాల పరంగా 50 కోట్లకు పైగా ప్రాఫిట్ ను దాటేసి సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో మైలురాయి ని కూడా అధిగమించింది సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు మూడో వీకెండ్ పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో అక్షరాలా 150 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి మాస్ ఊచకోత కోసింది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో హీరో కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు ఇప్పుడు….ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత…
మరో 150 కోట్లకు పైగా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుని ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడమే కాదు…టాలీవుడ్ హిస్టరీలోనే బాక్ టు బాక్ రెండు సార్లు 150 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అధిగమించి ఈ రికార్డ్ అందుకున్న రెండో హీరోగా నిలిచాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్…
ఓవరాల్ గా టాలీవుడ్ లో ప్రభాస్ మూడు సార్లు తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు సలార్ కల్కి సినిమాలతో బాక్ టు బాక్ ఈ రికార్డ్ ను సాధించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మరియు దేవర సినిమాలతో ఈ ఫీట్ ను సాధించాడు. ఇక లాంగ్ రన్ లో దేవర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.