Home న్యూస్ గుణ369 కలెక్షన్స్: అమ్మింది 6.7 కోట్లకు…ఫస్ట్ డే వచ్చింది ఇది!!

గుణ369 కలెక్షన్స్: అమ్మింది 6.7 కోట్లకు…ఫస్ట్ డే వచ్చింది ఇది!!

0

     RX100 తో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుణ 369 మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా టాక్ కన్నా కూడా సినిమా సాధించిన బిజినెస్ అందరికీ షాక్ ని కలగజేసింది. ఏకంగా 6.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా….

రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల దాకా షేర్ ని అందుకుంది, అందులో నైజాం లో 26 లక్షలు, సీడెడ్ లో 10 లక్షలు మిగిలిన చోట్ల 24 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా మొత్తం మీద వర్షాలు కొద్దిగా ఎఫెక్ట్ చూపినా డీసెంట్ కలెక్షన్స్ ని…

రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించింది…. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 10 లక్షల దాకా షేర్ ని అందుకోవడం తో టోటల్ గా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ బరిలో 70 లక్షల షేర్ ని సినిమా వసూల్ చేసింది, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 7.7 కోట్లు అవ్వడంతో మొదటి రోజు కలెక్షన్స్ ని…

పక్కకు పెట్టినా కూడా సినిమా లాంగ్ రన్ లో మరో 7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇది నిజంగానే అతి కష్టమైన పనిగా చెప్పుకోవాలి, ఆ మార్క్ ని అందుకోవాలి అంటే శని మరియు ఆదివారాలలో సినిమా ఓ రేంజ్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

ముఖ్యంగా రెండో మూడో రోజుల్లో రోజుకి 1.5 కోట్లకి తక్కువ కాని షేర్ ని అందుకుంటేనే లాంగ్ రన్ లో 7.7 కోట్ల టార్గెట్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి మొదటి వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here