రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), 22 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 322 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1613 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో కుమ్మేసింది….
ఇక సినిమా 23వ రోజున మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉంది. సినిమా 22వ రోజుతో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును సూపర్ స్టడీగా దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 1.8-2 కోట్ల రేంజ్ లో….
గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరోసారి 70-75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా హిందీలో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఇప్పుడు…
ఓవరాల్ గా 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా వరల్డ్ వైడ్ గా 23 వ రోజున….
14.5-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే మరోసారి అంచనాలను సినిమా మించే అవకాశం ఉంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 324 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 1628 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తున్న పుష్ప2 మూవీ ఇక టోటల్ గా 23 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.