టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా కి ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్ అవ్వడంతో సినిమాకి ఇది ఇంపాక్ట్ చూపగా దీనికి తోడూ కాంతార సినిమా ఇంపాక్ట్ వలన గాడ్ ఫాదర్ భారీగా స్లో డౌన్ అవ్వక తప్ప లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16వ రోజు మరోసారి ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను…
సొంతం చేసుకోగా సినిమా ఈవినింగ్ షోల టైం కి కూడా పెద్దగా ఏమి గ్రోత్ ని చూపించలేక పోయింది. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా కి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే ఈ కలెక్షన్స్ సాధ్యం అయ్యే అవకాశం ఉంది,
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక తేరుకునే అవకాశం కూడా కనిపించడం లేదు, ఇక దీపావళి మూవీస్ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో గాడ్ ఫాదర్ మరిన్ని థియేటర్స్ ని కోల్పోవడం ఖాయం. ఇక 16 రోజుల టోటల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.